బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) విమ‌ర్శించారు. ఇందిరాభవన్(Indira Bhavan) లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ల కుయుక్తుల‌ను ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) విమ‌ర్శించారు. ఇందిరాభవన్(Indira Bhavan) లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ల కుయుక్తుల‌ను ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు మన శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలన్నారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుంది. ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు. పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారు. కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారని.. బూత్ లు మార్చి ఓటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నార‌ని.. వీటన్నింటినీ ఎదుర్కొవడంలో బూత్ లెవెల్ ఎజెంటే కీలకం అన్నారు. బూత్ వారీగా ఓటర్ లిస్టును క్షున్నంగా పరిశీలించాలని.. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లేన‌న్నారు. బీజేపీని, బీఆర్ఎస్ ను వేరుగా చూడొద్దన్నారు. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Updated On 6 July 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story