కేసీఆర్(KCR) కుర్చీ కదులుతుందనే కేటీఆర్(KTR) ఢిల్లీలో(Delhi) గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నార‌ని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అని కామెంట్ చేశారు

కేసీఆర్(KCR) కుర్చీ కదులుతుందనే కేటీఆర్(KTR) ఢిల్లీలో(Delhi) గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నార‌ని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అని కామెంట్ చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని.. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని ఆరోపించారు.

ఐటీ దాడుల్లో(IT Ride) పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి(Modi) లొంగిపోయారని అన్నారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. తెలంగాణ(Telangana) గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని అన్నారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. 100కోట్ల లిక్కర్ స్కాంలో(Liquor Scam) కేజ్రీవాల్(Kejriwal) పై విచారణ జరిపిస్తున్న మోదీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు విచారణ చేయడంలేదు? అని ప్ర‌శ్నించారు.

నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను(amit shah) కలిశారు.. ఇంకా భ్రమలు పెట్టుకోవద్దు.. బీజేపీ, బీఆర్ఎస్ ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం.. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరని అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి అని వ్యాఖ్యానించారు. మీరు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా మీకు జవాబు రాదని.. తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం అని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా కలిసి రండి... మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే.. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని.. కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్.. దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Updated On 25 Jun 2023 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story