Revanth Reddy Alliance With CPI : కాంమ్రేడ్లకు కాంగ్రెస్ స్నేహ హస్తం..సీట్ల సర్దుబాటుపై డీల్ ఓకే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly Elections) ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐతో(CPI) కాంగ్రెస్(Congress) పొత్తు కుదిరింది. అధిష్ఠానం సూచనలతో సోమవారం సీపీఐ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. స్వయంగా పీసీసీ(PCC) చీఫ్ రేవంత్రెడ్డి(Revanth Reddy) ఆ నేతలతో సీట్ల అంశంపై చర్చించారు. ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలకు సీపీఐ నేతలు అంగీకరించినట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో కటీఫ్ అయ్యి.. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కమ్యునిస్టుల ప్రభావితం చేస్తారని భావించిన కాంగ్రెస్ హైకమాండ్..పొత్తుపై పునరాలోచన చేసింది. మరోసారి సీపీఐతో సోమవారం నాడు చర్చలు జరిపింది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీపీఐ ఆఫీసుకు వెళ్లి.. కీలక నేతలు కూనంనేని సాంబ శివరావు(Koonanneni Samba Shiva rao), చాడ వెంకటరెడ్డిలతో(Chada Venkata Reddy) చర్చలు జరిపారు. సుమారు గంటపైగా జరిపిన ఈ చర్చలతో కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ ఓకే చెప్పింది.
పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెంతోపాటు, అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. ఈ చర్చల అనంతరం రేవంత్రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. ఏఐసీసీ ఆదేశాలతో సీపీఐతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు.
కొత్తగూడెం(Kotha gudem) నుంచి సీపీఐ పోటీచేస్తుందని..నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అధిష్టానం ఓకే అన్నది కానీ.. నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అతి త్వరలోనే సీపీఎం(CPM) నేతలతోనూ రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సీపీఎం 17 మంది అభ్యర్థులను ప్రకటించడంతోపాటు మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ జరిపే చర్చలకు ఫలితం ఉంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది