ప్రముఖ గాయకుడు(Singer), తెలంగాణ ఉద్యమకారుడు(Agitator), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్(Chairman of Warehousing Company) సాయిచంద్(Sai chandh) అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి..

TPCC Revanth Reddy
ప్రముఖ గాయకుడు(Singer), తెలంగాణ ఉద్యమకారుడు(Agitator), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్(Chairman of Warehousing Company) సాయిచంద్(Sai chandh) అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటు(Heart attack) తో మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటుగా అభివర్ణించారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాయిచంద్ ను తెలంగాణ సమాజం మరువదని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) అన్నారు. సాయిచంద్ ఆకస్మిక మరణం విచారకరం.. చిన్న వయసులోనే సాయిచంద్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయింది. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం నేను నల్గొండలో నిరాహార దీక్ష చేసినన్ని రోజులు.. పాటలు పాడుతూ నా వెంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది..
ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటుందని అన్నారు. సాయిచంద్ తన ఆట పాటలతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని వివరించారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు.. సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన స్వరం ఆయువుపట్టుగా నిలిచిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్.. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
