ట్రిపుల్‌వన్ జీవో(111GO) ఎత్తివేతపై టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth reddy) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రియల్ ఎస్టేట్(Real estate) వాళ్ల కోసమే 111 జీవోను ఎత్తివేశారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై(KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బినామీ యాక్ట్ పర్‌ఫెక్ట్‌గా అమలు అవుతోందన్నారు. ట్రిపుల్‌వన్ జీవో ఎత్తివేతలో పెద్ద కుంభకోణం ఉందని
రేవంత్ ఆరోపించారు. 111 జీవో పరిధిలో బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు వేలాది ఎకరాలు కొన్నారని, 111జీవో ప్రాంతానికి తాగునీటి సమస్య కానేకాదన్నారు. నిజాం పాలకులు, సమైక్య పాలకులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తూ వచ్చారని, కేసీఆర్ మాత్రం దుర్మార్గం పాలిస్తూ హైదరాబాద్‌ను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.
పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల కారణంగా హైదరాబాద్ సర్వ నాశనం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హైదరాబాద్ విధ్వంసం మొదలయ్యిందని విమర్శించారు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిదన్నారు. హిరోషిమా నాగసాకి లాగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నారన్నారు. 111జీవో రద్దు వెనక ధనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయన్నారు రేవంత్‌రెడ్డి. 11 జీవో పరిధిలోని 80 శాతం భూములు కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీల చేతుల్లో ఉన్నాయన్నారు.
పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారన్నారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని ఆరోపించారు. 111జీవో రద్దు ముమ్మాటికీ విధ్వంసమే అని చెప్పారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణమంటూ మండిపడ్డారు. అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, కేసీఆర్, కేటీఆర్‌లను అమరవీరుల స్థూపం దగ్గర కట్టేసి రాళ్లతో కొట్టి చంపాలన్నారు. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయని.. నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇల్లు కడుతున్నారన్నారు. రాసుకొరా సాంబ అని కేసీఆర్ చెప్పగానే అరవింద్ వచ్చి రాసుకుంటారు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ దోపిడీలో వాటా లేకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో బండి సంజయ్, కిషన్‌రెడ్డి చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఉత్తినే అరవడం కాదు, 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని బండి సంజయ్‌కు సూచించారు. దావూద్‌నైనా క్షమించవచ్చు కానీకేసీఆర్, కేటీఆర్‌ను క్షమించలేమన్నారు. 111జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. . కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందన్నారు.