హైద్రాబాద్(hyderabad) సోమాజీగూడలోని ఓ హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్రపై సమావేశంలో చర్చించామని.. 2024లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్(Rahul Gandhi) ను ప్రధానిని చేయాలి.
హైద్రాబాద్(hyderabad) సోమాజీగూడలోని ఓ హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్రపై సమావేశంలో చర్చించామని.. 2024లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్(Rahul Gandhi) ను ప్రధానిని చేయాలి. ఇందుకు అవసరమైన కార్యాచరణపై యూత్ కాంగ్రెస్ కు సమావేశంలో దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొట్లాడేవారు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులవుతారని సూచించామన్నారు.
కష్టపడితే నాయకులు అవుతారు. దేశ భవిష్యత్తును మార్చుతారని యూత్ కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు సూచించారు. మోదీ(Modi), కేసీఆర్(KCR) లను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీకలకంగా పనిచేయాలని అన్నారు. గడీల పాలన పునరుద్ధరించడానికే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తెచ్చారని.. ధరణిని బరాబర్ రద్దు చేస్తామని వెల్లడించారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్ గిరి జిల్లాల్లో భూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వేల ఎకరాలు కేసీఆర్ బినామీలకు కట్టబెట్టారని.. అవకతవకలకు పాల్పడ్డ అధికారులను ఊచలు లెక్కబెట్టిస్తామని పేర్కొన్నారు. నిజాంల వేల ఎకరాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధీనంలో లేదని.. దళారుల చేతుల్లో ఉందని అన్నారు. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా? అని ప్రశ్నించారు.
ధరణి(Dharani) పోర్టల్ ప్రారంభించిన ఊరిలో భూముల రికార్డు లేదని.. ధరణి పోర్టల్ ను కేసీఆర్ దోపిడీకి వాడుకున్నారని అన్నారు. ఏడ్చి, గోల పెట్టినా.. తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామని అన్నారు. ధరణి అవకతవకలపై కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం అన్నారు. విద్య(Education), ఉపాధి, సంక్షేమం(Welfare).. దేనిపైన అయినా చర్చకు సిద్ధం అని.. కేటీఆర్, హరీష్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ చేయనిది ఏదైనా మీరు చేసి ఉంటే మేం క్షమాపణ చెప్పడానికి సిద్ధమన్నారు. తండ్రి కొడుకులు నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతున్నరని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందని అడుగుతున్నారు. కేసీఆర్ లా మేం రాష్ట్రాన్ని కొల్లగొట్టం.. దోపిడీలు చేయం అని పేర్కొన్నారు. కేసీఆర్ కు బుద్ది జ్ఞానం ఉంటే ఉద్యమకారులను పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే రేవంత్ రెడ్డి పేరు తీయాలి. నా పేరు పలికేందుకు కేసీఆర్ కు భయం అన్నారు.
కాంగ్రెస్ అడ్డుకోవడానికే కేసీఆర్ చిల్లర మల్లర చేష్టలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ రద్దైన వెయ్యి నోటులాంటివారని.. మోదీ 2 వేల నోటు లాంటి వారని సెటైర్లు సంధించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. ఈ దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని.. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. 5 అత్యంత కీలక అంశాలను ప్రజల ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లతో ముందుకెళతామన్నారు. సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేయాలని పార్టీ పెద్దలతో చర్చిస్తున్నామని తెలిపారు.