కేసీఆర్(KCR) విడుదల చేసిన లిస్ట్ చూశాక రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్(Congress) పార్టీనే అని అర్ధమైందని పీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కామెంట్ చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే.. ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారన్నారు.

Revanth Reddy Comments On KCR

కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది.. కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమేనన్నారు. ఈ విషయాన్ని మైనారిటీలు(Minorities) నిశితంగా గమనిస్తున్నారన్నారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. ఆయన గొంతులో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్ సవాల్ ను కేసీఆర్ స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. 12.03 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా(Wine shop lucky draw) తీశారు.. కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలన్నారు.