చెప్పినట్టుగానే సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌(Hyderabad) చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయాని(Charminar Bhagyalaxmi Mata Temple)కి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) వెళుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode By Poll)లో అధికారపార్టీ బీఆర్ఎస్‌(BRS) నుంచి పాతిక కోట్ల రూపాయలు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రేవంత్‌రెడ్డి బీజేపీ బాగా నమ్మే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పారు.

చెప్పినట్టుగానే సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌(Hyderabad) చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయాని(Charminar Bhagyalaxmi Mata Temple)కి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) వెళుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode By Poll)లో అధికారపార్టీ బీఆర్ఎస్‌(BRS) నుంచి పాతిక కోట్ల రూపాయలు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రేవంత్‌రెడ్డి బీజేపీ బాగా నమ్మే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పారు. అక్కడే కాదు, ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్‌ కార్యకర్తలు సమకూర్చిందేనని, సాయం అందించిన వారిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని రేవంత్‌ తెలిపారు. తాను బీఆర్‌ ఎస్‌ నుంచి కానీ, కేసీఆర్‌ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి అయితే ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. మరి రేవంత్‌ సవాల్‌కు ఈటెల స్పందిస్తారా? ఆయన కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు.

Updated On 22 April 2023 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story