గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయాన్ని(GHMC Office) కాంగ్రెస్(Congress) శ్రేణులు ముట్టడించాయి. హైదరాబాద్ లో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

Congress At GHMC Office
గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయాన్ని(GHMC Office) కాంగ్రెస్(Congress) శ్రేణులు ముట్టడించాయి. హైదరాబాద్ లో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా టీపీసీసీ(TPCC) అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపు మేరకు కాంగ్రెస్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు పది వేల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని.. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యలయ పరిసర ప్రాంతాల్లో భారీగా జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.
