ఖమ్మం(khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas Reddy) ఇంటికి టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు(Komati venkat reddy) చేరుకున్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో..
ఖమ్మం(khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas Reddy) ఇంటికి టీపీసీసీ(TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు(Komati venkat reddy) చేరుకున్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో.. వీరి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఇంటికి వెళ్లిన ఇరువురు నేతలు.. ఆపై పొంగులేటితో భేటీ అయ్యారు. పొంగులేటిని కలవడానికి ముందు జూపల్లి నివాసంలో ఇరువురు నేతలు లంచ్ చేశారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జూపల్లి కృష్ణారావు, కూచకుళ్ల దామోదర్ రెడ్డిలను(Kuchakulla Damodar Reddy) పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణలో 15 స్థానాలు గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు.