అమెరికా(america) న్యూజెర్సీలో(new Jersy) తెలంగాణ అవిర్భవ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు(Revanth Reddy). ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌(KCR) దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం..

అమెరికా(america) న్యూజెర్సీలో(new Jersey) తెలంగాణ అవిర్భవ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు(Revanth Reddy). ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌(KCR) దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం.. తెలంగాణ అభివృద్ధి లో మీరు భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐల‌కు(NRI) పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించి పోరాటాలు చేసి త్యాగాలు చేసి రాష్టాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాజకీయాలను అవినీతి మయం చేస్తుంద‌ని విమ‌ర్శించారు.

అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో 9 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారు. 17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చింది. 22 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన అని చెప్పిన టీఆర్ఎస్ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. కానీ.. కేసీఆర్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన చెయ్యలేదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలి. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated On 3 Jun 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story