ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లో డి. శ్రీనివాస్ పార్దివదేహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్ పుష్ప గుచ్చాన్ని సమర్పించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని, మెంటర్ గా తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డి. శ్రీనివాస్ ఎంతో శ్రమించారన్నారు. అధిష్టానానికి, ప్రత్యేకంగా సోనియా గాంధీకి అత్యంత సన్నితుడిగా ఉండేవారన్నారు. తెలంగాణ ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఇతర పార్టీలోకి వెళ్లి వచ్చినప్పటికీ.. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ జెండాతోనే ఉంటానని, చనిపోయాక తనపై కాంగ్రెస్ జెండానే ఉండాలని డి.శ్రీనివాస్ పేర్కొన్నారని మధు యాష్కి గుర్తు చేశారు.