రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో ప్రభుత్వం(Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు శుక్రవారం(Friday) కూడా సెలవు(Holiday) ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy)ని సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే బుధ, గురు రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించగా.. వర్షాలు తగ్గకపోవడంతో శుక్రవారం కూడా పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ(Telanagna) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, నదులు, చెరువులు పొంగి పొర్లతున్నాయి. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు(Holidays For Schools) ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.