Telangana Congress : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
బీజేపీ నేతల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది
బీజేపీ నేతల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీన్దర్ సింగ్ ఆరా ఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. మీ నానమ్మ కు పట్టిన గతినే నీకు పడుతుందని ఒక పబ్లిక్ మీటింగ్ లో బెదిరించారు. ఇలా ఒక జాతీయ పార్టీ నేతను, ప్రధాన ప్రతిపక్ష నేతను బీజేపీ నాయకుడు బెదిరించినా.. ప్రధాని మోదీ కానీ.. హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కానీ ఏ మాత్రం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఏఐసీసీ సూచించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోయే ధర్నాలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ రోజు హైదరాబాద్ డీసీసీల ఆధ్వర్యంలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.