రాయితీపై ట్రాఫిక్ చలాన్ల(Taffic Challan) చెల్లింపున‌కు ఈ రోజు అర్ధ‌రాత్రితో గ‌డువు ముగియ‌నుంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ రాయితీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని గ‌తం లోనే అధికారులు తేల్చి చెప్పారు. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపులను గురువారం అర్ధ‌రాత్రి 11:59 గంట‌ల వరకు స్వీకరిస్తారు.

రాయితీపై ట్రాఫిక్ చలాన్ల(Taffic Challan) చెల్లింపున‌కు ఈ రోజు అర్ధ‌రాత్రితో గ‌డువు ముగియ‌నుంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ రాయితీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని గ‌తం లోనే అధికారులు తేల్చి చెప్పారు. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపులను గురువారం అర్ధ‌రాత్రి 11:59 గంట‌ల వరకు స్వీకరిస్తారు. తర్వాత నుంచి రాయితీ ఉండదు. ఎంత చలాన్‌ పడిందో అంత కట్టుకోవాల్సిందే! గత ఏడాది డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపచేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌భుత్వం గ‌డువు పొడిగింది. ఇక‌పై గ‌డువు పొడిగించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఇక ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది సర్కార్..

Updated On 15 Feb 2024 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story