తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దుకాణాల‌ కోసం రికార్డు స్థాయిలో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. రాష్ట్రంలో 2,620 షాపులకు గానూ 1,31,490 దరఖాస్తులు వ‌చ్చాయి.

తెలంగాణ(Telangana)లో మద్యం దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ(Wine Shops Lucky Draw) చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దుకాణాల‌ కోసం రికార్డు స్థాయిలో ద‌ర‌ఖాస్తులు(Applications) వ‌చ్చాయి. రాష్ట్రంలో 2,620 షాపులకు గానూ 1,31,490 దరఖాస్తులు వ‌చ్చాయి. ద‌ర‌ఖాస్తుల ద్వారానే రూ 2,639.28 కోట్లు ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా(Lucky Draw) ద్వారా దుకాణాలు కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది. 2021-23 సంవ‌త్స‌రంలో 68,691 దరఖాస్తులు రాగా.. రూ.1,357 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ సారి రెట్టింపు ద‌ర‌ఖాస్తులు రావ‌డంతో.. షాపులు ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే ఉత్కంఠ నెల‌కొంది.

2,620 షాపుల‌లో ఒక్కో దుకాణానికి స‌గ‌టున 50 దర‌ఖాస్తులు రాగా.. హైద‌రాబాద్(Hyderabad) ప‌రిస‌ర ప్రాంత జిల్లాల‌లోని 615 దుకాణాల‌కు గాను ఒక్కోదానికి 69 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. శంషాబాద్‌(Shamshabad)లో 100 మద్యం దుకాణాలకు గానూ 10,621 దరఖాస్తులు వ‌చ్చాయి. దీంతో ఒక్కో మద్యం దుకాణానికి 106కు పైగా అర్జీలు వచ్చాయి. అలాగే సరూర్‌ నగర్‌(Saroor Nagar)లోని 134 దుకాణాలకు గానూ 10,994 దరఖాస్తులు వచ్చాయి. ఇక్క‌డ‌ ఒక్కో దుకాణానికి 82 దరఖాస్తులు వచ్చాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Updated On 20 Aug 2023 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story