TS Election 2023 : మరికొన్ని గంటల్లో ప్రచారం సమాప్తం...ఇక మిగిలింది ప్రలోభాల పంపిణీనే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangna Assembly Election) ప్రీక్లయిమాక్స్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇక పోలింగ్(Polling) జరగడమే తరువాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంత ప్రచారం చేసుకున్నా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే! ఆ తర్వాత ప్రచారం చేసుకోడానికి కుదరదు. మైకులన్నీ బంద్! సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారాన్ని ముగించాలి. అన్నట్టు సాయంత్రం నాలుగు తర్వాత రాజకీయ పార్టీల నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికల అంశాలకు సంబంధించి మీడియాతో(Media) మాట్లాడకూడదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangna Assembly Election) ప్రీక్లయిమాక్స్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇక పోలింగ్(Polling) జరగడమే తరువాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంత ప్రచారం చేసుకున్నా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే! ఆ తర్వాత ప్రచారం చేసుకోడానికి కుదరదు. మైకులన్నీ బంద్! సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారాన్ని ముగించాలి. అన్నట్టు సాయంత్రం నాలుగు తర్వాత రాజకీయ పార్టీల నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికల అంశాలకు సంబంధించి మీడియాతో(Media) మాట్లాడకూడదు. విలేకరుల సమావేశాలను నిర్వహించకూడదు. ఈ మేరకు ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాలు జారీ చేసింది. ఇక పోలింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీ పనిలో పడ్డాయి. ఇప్పటికే నియోజకవర్గాలలో చేరాల్సిన డబ్బంతా చేరిపోయింది. మద్యం కూడా చేరాల్సిన చోటికి చేరిపోయింది. కొన్ని నియోజకవర్గాలలో ఓటుకు కనిష్టంగా రెండు వేల రూపాయలు ఇస్తున్నారని వినికిడి. పోటీ తీవ్రంగా ఉన్న చోట్లలో ఓటు రేటు మూడు వేలు పలుకుతున్నదట! మిగిలిన ఈ కొద్ది గంటలను కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో పార్టీలు ఉన్నాయి.