రెండు వేల రూపాయల నోట్లను(2000 Notes) మార్చుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. ఈ రోజు దాటితే మన దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు పనికిరావు. నోట్ల ఎక్ఛేంజ్‌ గడువు పెంచేది లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి చాలా మట్టుకు నోట్లు బ్యాంకుకు చేరుకుంటాయనే అనుకుందాం! అన్నట్టు ఇవాళ మరో డెడ్‌లైన్‌(Dead Line) కూడా ఉంది..

రెండు వేల రూపాయల నోట్లను(2000 Notes) మార్చుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. ఈ రోజు దాటితే మన దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు పనికిరావు. నోట్ల ఎక్ఛేంజ్‌ గడువు పెంచేది లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి చాలా మట్టుకు నోట్లు బ్యాంకుకు చేరుకుంటాయనే అనుకుందాం! అన్నట్టు ఇవాళ మరో డెడ్‌లైన్‌(Dead Line) కూడా ఉంది..

తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అంటూ ఓ పార్టీని పెట్టేసి కాలికి బలపం కట్టుకుని పాదయాత్రలు చేసిన షర్మిలSharmila() కాంగ్రెస్ పార్టీకి(Congress) పెట్టిన డెడ్‌లైన్‌ ఈరోజుతో ముగుస్తుంది. ఎమ్మెల్యేలను, మంత్రులను, ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా అనరాని మాటలనేసి పార్టీకి మైలేజ్‌ వస్తుందనుకున్న షర్మిలకు అలాంటిదేమీ కనిపించకపోయేసరికి పార్టీని కాంగ్రెస్‌లో కలపడమే ఉత్తమమని అనుకున్నారు.

ఈ రోజు కనుక విలీనంపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల బరిలో సొంతంగా బరిలో దిగుతామని ప్రకటించారు షర్మిల. మరి షర్మిల అభ్యర్థనను కాంగ్రెస్‌ ఒప్పేసుకుని విలీనంపై ప్రకటన చేస్తుందా లేక అది బెదిరింపుగా భావించి లైట్‌ తీసుకుంటుందా అన్నది సాయంత్రం వరకు తేలిపోతుంది.

నాలుగు రోజుల క్రితం త‌మ పార్టీ నాయ‌కుల స‌మావేశంలో ష‌ర్మిల ఏమన్నారంటే, ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, విలీనం లేకుంటే వ‌చ్చే ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామన్నారు. అక్టోబ‌ర్ రెండో వారం నుండి ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండేలా కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తున్నామ‌ని, పార్టీ కార్య‌వ‌ర్గం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తిఒక్క‌రికీ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

విలీనంపై కాంగ్రెస్‌ అధినేతలతో చాలాసార్లు చర్చలు జరిపారు షర్మిల. కానీ విలీనంపై కాంగ్రెస్‌ అధినాయకత్వం నుంచి ఎలాంటి కబురురావడం లేదు. షర్మిల రాకను టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అడ్డుకుంటున్నారనే వార్తలు కూడా వినిపించాయి. బ‌హుశా అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ష‌ర్మిల పార్టీపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోవచ్చనిపిస్తోంది.

తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిలకు చెక్‌ పెట్టడానికే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కూడా కన్‌ఫామ్‌ చేసింది కాంగ్రెస్‌!ఈ పరిణామాలు సహజంగానే షర్మిలకు మింగుడుపడలేదు. అయినప్పటికీ డెడ్‌లైన్‌ ఇవాళ ముగుస్తుండటంతో ఎలాంటి ప్రకటన వస్తుందా అనే ఉత్కంఠ అయితే అందరిలోనూ ఉంది.

Updated On 30 Sep 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story