భారత భవిష్యత్ కు నాంది ఈ తెలంగాణ ఎన్నికలని ఖమ్మం కాంగ్రెస్ అభ్య‌ర్ధి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డితో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ధర్మం వైపు నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మార్పుకు నాంది ఖమ్మం కావాలన్నారు. ఏ పార్టీలో ఉన్న పార్టీ కీర్తి ప్రతిష్టాలకోసం పార్టీ అభ్యున్నతికి పాల్పాడే వాళ్ళమ‌న్నారు.

నా మిత్రుడు, ముఖ్యమంత్రి కెసీఆర్ ఒకటే స్పీచ్ పది నియోజకవర్గల్లో మాట్లాడుతున్నాడని.. మేధావి అయిన కేసీఆర్ స్పీచ్ చూసి జాలి వేస్తుందన్నారు. కేసీఆర్ కు ఖమ్మంలో చాలా ఇచ్చాము. మా ఇద్దరి రాజకీయ జీవితం చుసిన కేసీఆర్ ఇలా మాట్లాడుతుంటే జాలేస్తుందన్నారు. 17వ తేదీ ఉదయం 10 గంట‌ల‌కు మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్డు షో, అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. సభను విజయవంతం చేయాలని పినపాక నియోజకవర్గ ప్రజలను కోరారు.

పొంగులేటి కామెంట్స్..

గత కొద్దీ రోజులుగా తెలంగాణ ప్రజలు ప‌రిస్థితుల‌ను స్పష్టంగా పరిశీలిస్తున్నారని పొంగులేటి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెప్పేది.. కాంగ్రెస్ వచ్చినట్ట‌యితే అని పదే పదే అంటున్నారు.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది అని వాళ్లకు తెలుసు.. అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఉచిత కరెంట్‌ను కేసీఆర్ కనుగొన్నట్లు కాంగ్రెస్ కు తెలియనట్లు కాంగ్రెస్ పార్టీ మాట్లాడని మాటలను వక్రీకరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ మధ్య హరీష్ రావు మాట్లాడారు సీట్ల కోసం పక్క రాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు.. సీట్లు అమ్ముతున్నారు అని.. కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండ ఉంది. మీకు డబ్బు అండ ఉంది. ప్రజల చందాతో ఎన్నిక చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. మీరు బిర్యాని పెట్టిన.. మేము చెట్నీ పెట్టిన మా బువ్వను సంతోషంగా తినడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 17న‌ పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో రాహుల్ గాంధీ సభ ఉంద‌ని.. దానిని విజయవంతం చేయాలని కోరారు.

Updated On 15 Nov 2023 6:48 AM GMT
Ehatv

Ehatv

Next Story