ప్రజాప్రతినిధులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. పోలేపల్లిలో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు, అధికార పార్టీకి ఎమ్మెల్యేలపై కంట్రోల్ తప్పిందన్నారు

ప్రజాప్రతినిధులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు(Thummala Nageswara Rao) అన్నారు. పోలేపల్లి(Polepalli)లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు, అధికార పార్టీకి ఎమ్మెల్యేలపై కంట్రోల్(Control) తప్పిందన్నారు. ఎమ్మెల్యేల దోపిడీ అత్యంత జుగుప్సాకరంగా ఉంద‌న్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదని.. నేను ఎక్కడున్నా ప్రజల అభివృద్ధి మాత్రమే కాంక్షిస్తాన‌న్నారు. ప్రజావ్యతిరేకులను పక్కకు పెట్టాల్సిన బాధ్యత మీదేన‌న్నారు.

కొంతమంది అధికారుల సంగతి కూడా చూసే సమయం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ కి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నడవాల్సిన అవసరం లేకపోయినా.. దేశప్రజల కోసం సాహసం చేశారని అన్నారు. రాహుల్(Rahul Gandhi) తప్పకుండా ప్రధాన మంత్రి కావాలన్నారు. ఎంతో నిడారంభరమైన జీవితాన్ని రాహుల్ ఆచరిస్తున్నారని కొనియాడారు. ఈ దేశ కోడలిగా తెలంగాణా(Telangana) ఆకాంక్ష తీర్చిన వ్యక్తి సోనియా గాంధీ(Sonia Gandhi) అని అన్నారు. అరాచక శక్తులను తరిమి కొట్టాలసిందేన‌ని పిలుపునిచ్చిన ఆయ‌న‌.. కేవలం నెల రోజులు కష్టపడి.. ఆనందకరమైన ప్రజల జీవితంపై బాటలు వేద్దామ‌న్నారు.

Updated On 21 Oct 2023 11:11 PM GMT
Yagnik

Yagnik

Next Story