కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గత ప్రభుత్వ లీలలు ప్రజలు చూశార‌ని అన్నారు.

కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గత ప్రభుత్వ లీలలు ప్రజలు చూశార‌ని అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగిన సభ కంటే ఏప్రిల్ 6న జరగనున్న సభ సక్సెస్ అవుతుందని.. మా ప్రభుత్వ పాలనను దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు పొగుడుతున్నారు. మా కమిట్మెంట్ గుర్తించకపోగా.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. రేపో, ఎల్లుండో ప్రభుత్వ నివేదిక వస్తుంది. నివేదిక రాగానే రైతులను ఆదుకుంటామ‌న్నారు. ఎప్పుడూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని గత ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తోందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం ఐదారు నెలల పాటు రైతుబందు వేశారు. మేం వచ్చి మూడు నెలలే అయ్యింద‌ని.. పంటల బీమా పథకంలో చేరుతామ‌ని.. రైతులకు ఏ సమస్యా వచ్చినా ఆదుకుంటామ‌ని అన్నారు.

Updated On 29 March 2024 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story