టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మధ్యంతర బెయిల్(Bail) రావడంతో ఆయన నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అధినేతకు బెయిల్ మంజూరవడంతో తెలుగుదేశం(Telugu Desham) శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం(Khammam)లో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగింపులో టీడీపీ నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwar Rao)ను ఆహ్వానించగా.. ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. నా రాజకీయ ప్రస్థానం మొదలైన దేవాలయం ఇదేనన్నారు. ఎన్టీఆర్(NTR) రాజకీయ వరమిస్తే.. చంద్రబాబు(Chandrababu) పెంపకంలో నిబద్దత క్రమశిక్షణగా ఎదిగానని పేర్కొన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సంతోషం మీతో పంచుకోవాలని వచ్చానని అన్నారు. నిజాయితీ, పట్టుదల గల వ్యక్తులు తెలుగుదేశం సొంతమన్నారు. నా విజయంలో మీరు భాగస్వాములు కావాలని కోరారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి(Khammam Congress Candidate)గా ఉన్న తుమ్మల.. తెలుగుదేశం కార్యాలయంలో అడుగుపెట్టడంపై బీఆర్ఎస్(BRS) నేతలు విమర్శలు చేస్తున్నారు.