తెలంగాణ స్టేట్‌ రియలెస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు షోకాజు నోటీసులకు(Show cause  Notice) స్పందించకుండా, విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రెరా రిజిస్ట్రేషన్‌ పొందకుండా అడ్వర్‌టైజింగ్‌, మార్కెటింగ్‌ కార్యకలాపాలకు పాల్పడిన పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు అపరాధ రుసుం విధించింది రేరా.

తెలంగాణ స్టేట్‌ రియలెస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు షోకాజు నోటీసులకు(Show cause Notice) స్పందించకుండా, విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రెరా రిజిస్ట్రేషన్‌ పొందకుండా అడ్వర్‌టైజింగ్‌, మార్కెటింగ్‌ కార్యకలాపాలకు పాల్పడిన పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు అపరాధ రుసుం విధించింది రేరా.

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(Sahiti Infratech Ventures India Pvt) సంస్థ సాహితి సితార్‌ కమర్షియల్(Sahitya Sitar Commercial) పేరుతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ఫ్టాట్స్‌ నిర్మాణాన్ని చేపట్టింది. రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండానే నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొనుగోలుదారులను ఆకర్షిస్తూ అమ్మకాల కోసం ప్రచారం చేసుకుంటున్న సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా లిమిటెడ్‌ , కేసినేని డెవలపర్స్‌కు ఫైన్‌ విధించింది రెరా.

సాహితీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు 10.74 కోట్ల రూపాయల జరిమానా విధించింది రెరా. అలాగే మంత్రి డెవలపర్స్‌కు రెరా అధికారులు 6.50 కోట్ల రూపాయల జరిమానా విధించారు. జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలోని ప్రాజెక్టుపై జరిమానా విధించినట్టు రెరా తెలిపింది. అనుమతులు లేకుడా నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు సమాచారం అందచేసి నిర్మాణాలు చేపట్టడంపై రెరా సీరియస్‌ అయ్యింది. అపరాధరుసుం నుంచి 15 రోజులలో చెల్లించాలని రెరా ఆదేశించింది. అపరాధ రుసుము చెల్లించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది.

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సాహితీ శర్వాణి ఎలైట్‌ పేరుతో 2022, ఆగస్టు 22న సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టింది. సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించినప్పటికీ సదరు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా మార్కెటింగ్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ కార్యకలాపాలకు పాల్పడి ఫ్లాట్స్‌ విక్రయాన్ని చేపట్టింది.

మంత్రి డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్టు చేపట్టి ఫారం-బి లో తప్పుడు సమాచారం పొందుపర్చి వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. అలాగే సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్‌ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది.

Updated On 23 Sep 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story