మీరు చూస్తున్న ఈ ముగ్గురు బుడతలు (Boys) హైదరాబాద్‌లోని మాంటెస్సోరీ హౌస్‌ ఆఫ్ చిల్డ్రన్‌ స్కూళ్లో (Montessori House of Children School) చదువుతున్నారు. చదువులో రాణిస్తూ క్రీడల్లో (Sports) ప్రావీణ్యం నేర్చుకున్నారు. పేరెంట్స్‌ ఎంకరేజ్‌మెంట్‌తో చెస్, ఇతర క్రీడల్లో సత్తా చాటుతున్నారు

మీరు చూస్తున్న ఈ ముగ్గురు బుడతలు (Boys) హైదరాబాద్‌లోని మాంటెస్సోరీ హౌస్‌ ఆఫ్ చిల్డ్రన్‌ స్కూళ్లో (Montessori House of Children School) చదువుతున్నారు. చదువులో రాణిస్తూ క్రీడల్లో (Sports) ప్రావీణ్యం నేర్చుకున్నారు. పేరెంట్స్‌ ఎంకరేజ్‌మెంట్‌తో చెస్, ఇతర క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (International Book of Records) చోటు సంపాదించుకునే అవకాశం ఈ చిన్నారులకు దక్కింది. పంజాబ్‌కు (Punjab) చెందిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ముగ్గురు చిన్నారుల ప్రతిభను గుర్తించింది. డిసెంబర్ 29న అమృత్ సర్‌లో (Amrit sir) జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. చిన్నవయసులో దేశాల జెండాలను చూసి క్షణాల్లో ఆ దేశాల పేర్లు చెప్పడం.. మరొకరు ప్రపంచలో ఉన్న వివిధ రకాల కార్ల లోగోలను చూసి వాటి కంపెనీల పేర్లను వల్లించడం సాధారణ విషయం కాదు. వీరి మెమరీ పవర్‌ చూసి అందరూ పరేషాన్ అవుతున్నారు. ఈ ముగ్గురి టాలెంట్‌ను ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది..
' లెట్స్‌ నో హూ దే ఆర్'..

మొదటి బాల మేధావి ఎస్.అదిత్‌ నారాయణ్‌ (S.Adith Narayn), వయస్సు 9 ఏళ్లు మాత్రమే. ఈ చిన్నారి 100 దేశాల జాతీయ జెండాలు (National Flags) చూసి ఆయా దేశాల పేర్లను 54 సెకండ్లలో ధారాళంగా చెప్పేస్తాడు. దీంతో "ఫాస్టెస్ట్ టు ఐడెంటిఫై & రిసైట్ 100 నేషనల్ ఫ్లాగ్స్" గా (Fastest to Identify & Recite 100 National Flags) ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన జెండాను అదిత్ నారాయణ్‌ పాతేశాడు. ఇతని పేరెంట్స్ సత్తు ఐశ్వర్య, వివేక్‌. ఐశ్వర్య హౌస్‌ వైఫ్‌.. సత్తు వివేక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

వీరి చిన్న కుమారుడు ఆర్యన్ (Aaryan) మరో బాల మేధావి. ఈ బాలుడు కూడా 100 దేశాల జాతీయ జెండాలను 4 నిమిషాల 10 సెకండ్లలో ఆ జెండాలకు సంబంధించిన దేశాలను చెప్పేస్తాడు. కేవలం నాలుగేళ్లలోనే ఈ చిచ్చుబుడ్డిగాడు.. జెండాలను గుర్తించి 100 దేశాల పేర్లు చెప్పడాన్ని చూసినవారంతా 'నిజమేరా.. వీడిది మామూలు కటౌట్‌ కాదురా' అని అంటున్నారు. ఇంత చిన్న ఏజ్‌లో ఈ ఫీట్‌ సాధించడంతో ఆర్యన్‌ కూడా రికార్డ్‌ల్లోకి ఎక్కేశాడు.

ఇక ఇంకో టాలెంటెడ్‌ బాయ్‌.. టి.రామానంద్ (T.Ramanand).. ఇతని వయస్సు 9 ఏళ్లు. ప్రపంచంలో ఉన్న కార్ల లోగో (Cars logo)లను చూసి ఆయా కార్ల కంపెనీల పేర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పడం మనోడి సొంతం. ఇందుకు ఈ చిన్నారికి కావాల్సిన సమయం కేవలం 22 సెకండ్లు మాత్రమే. 22 సెకండ్లలో 50 లోగోలు కలిగి ఉన్న కార్ల పేర్లు చెప్పి రికార్డ్ సొంతం చేసుకున్నాడు. "ఫాస్టెస్ట్ టు ఐడెంటిఫై ఫిఫ్టీ కార్ లోగోస్" (Fastest to Identify Fifty Car Logos)అనే పేరుతో రికార్డ్‌ సృష్టించాడు. రామానంద్‌ తల్లిదండ్రులు తెడ్లపల్లి అర్చన (Tedlapally Archana) గృహిణిగా ఉంటే.. తండ్రి తెడ్లపల్లి నిషాంత్‌ (Tedlapally Nishanth) వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. డిసెంబర్ 29న అమృత్ సర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ బుడతలు అవార్డులు అందుకున్నారు

Updated On 6 Jan 2024 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story