Jagtial Holi Crimeఈరోజుల్లో మనుషులు ఎలా తయారవుతున్నారో తెలియడం లేదు. వివాహేతర సంబంధాల(Extra Marital Affairs) కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి.

Jagtial Holi Crime
ఈరోజుల్లో మనుషులు ఎలా తయారవుతున్నారో తెలియడం లేదు. వివాహేతర సంబంధాల(Extra Marital Affairs) కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. ఓ మహిళ తన కన్నా 20 ఏళ్లకు పైగా చిన్న వయసు ఉన్న యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. ఇలా కొన్నాళ్లుగా వ్వవహారం కొనసాగుతోంది. అయితే ఆ యువకుడికి మహిళ కూతురుపై కూడా కన్నుపడింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కూతురును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఆమెను హతమార్చాడు.
జగిత్యాల(Jagtial) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిప్పన్నపేట(Thippannapeta) గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్–రమ దంపతులకు కొడుకు రిషివర్దన్, కుమార్తె వాణి ఉన్నారు. సోమవారం హోలీ వేడుకల్లో బోగ ప్రకాశ్(Bhoga Prakash) అనే వ్యక్తి సురేష్ ఇంటిపై కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్దన్ అతడిని నిలదీయగా వివాదం జరిగింది. ఈ క్రమంలో ప్రకాశ్ కొడవలితో రమపై దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. అయితే మొదటగా కోడిగుడ్లు విసరడంతో వివాదం చెలరేగి చనిపోయిందనుకున్నారు. కానీ ఆరా తీయగా ఆమెను బోగ ప్రకాష్ అనే వ్యక్తి కావాలనే చంపాడని తేలింది. రమతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. అంతే కాకుండా రమ కూతురు వాణిని కూడా ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. ఆమె కూతురుతో పెళ్లి జరిపించాలని కోరడంతో అందుకు రమ ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న ప్రకాష్ హోలీ పండగ రోజు రమను కొడవలితో నరికిచంపాడు.
