బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం గద్దె దిగి 48 గంటలు కూడా కాలేదు. అప్పుడే కరెంట్‌పై సెటైర్లు మొదలయ్యాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పవర్‌కట్‌ను మర్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కోతలు విపరీతంగా ఉండేవి. ప్రాణం పోకడ, కరెంట్ రాకడ ఎవరూ చెప్పలేరనే కొత్త సామెత కూడా పుట్టుకొచ్చింది.

బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం గద్దె దిగి 48 గంటలు కూడా కాలేదు. అప్పుడే కరెంట్‌పై సెటైర్లు మొదలయ్యాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పవర్‌కట్‌ను మర్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కోతలు విపరీతంగా ఉండేవి. ప్రాణం పోకడ, కరెంట్ రాకడ ఎవరూ చెప్పలేరనే కొత్త సామెత కూడా పుట్టుకొచ్చింది. సమ్మర్‌లో అయితే పరిస్థితి దారుణంగా ఉండేది. తెలంగాణ(Telangana) వస్తే అంధకారం అవుతుందని ఎకసెక్కాలాడినవారే నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారి పట్టుమని 36 గంటలు కాలేదు. పవర్‌కట్‌ అనే మాట వినిపించింది. అది కూడా కాంగ్రెస్‌(Congress) నాయకుడు తీన్మార్‌ మల్లన్న(Thinmar Mallanna) నోటి వెంట! తీన్మార్‌ వార్తలు చేద్దాం అంటే పవర్‌కట్టయ్యింది. జనరేటర్‌ కూడా పని చేయడం లేదు. కరెంట్‌ పోవడం వల్ల వార్తలు చదవడం లేటయ్యింది. క్షమించండి అని అంటున్న తీన్మార్‌ మల్లన్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిత్రవిచిత్రాతి కామెంట్లు పెడుతున్నారు. అలా అనకు సోదరా.. తథాస్తూ దేవతలు ఉంటారు అని ఒకరు కామెంట్‌ చేస్తే... మొదలయ్యింది అని మరొకరు వ్యాఖ్యానించారు.

Updated On 5 Dec 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story