మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా జడ్చర్ల(jedcherla) దగ్గర ఓ బస్సులో 36 లక్షలు చోరీ(robbery) గురయ్యాయి
మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా జడ్చర్ల(jedcherla) దగ్గర ఓ బస్సులో 36 లక్షలు చోరీ(robbery) గురయ్యాయి. ఈ నెల 16న పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ(RTC) సూపర్ లగ్జరీ బస్సులో 36 లక్షల నగదు చోరీ చోటుచేసుకుందని, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న దామోదర్ అనే ట్రాన్స్‌కో ఉద్యోగి తన చెల్లెలి అవసరాల కోసం పీఎఫ్, సేవింగ్స్ డబ్బులను మొత్తం 38 లక్షల రూపాయల మేర డ్రా చేసుకొని 36 లక్షలు ఒక కవర్‌లో, 2 లక్షలు మరో కవర్లో పెట్టుకొని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో బయలుదేరాడు. డబ్బులు ఉన్న బ్యాగును బస్సు పై క్యాబిన్‌లో పెట్టాడు. జడ్చర్లలోనే బ్యాగు పోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే జడ్చర్ల పోలీసులు నాలుగు బృందాలుగా విచారణకు వెళ్లారు. హైదరాబాద్‌లోని సీసీ కెమెరాల ఫుటేజి, కాల్‌డేటా ఆధారంగా నిందితులు యూపీ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నూరి జిల్లాకు చెంది షారుక్, అబ్దుల్ సతార్, షేక్ దిల్షాద్‌లుగా గుర్తించారు. యూపీ పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 29.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. నిందితులు 15 రోజుల ముందే పహడీషరీఫ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని చెప్పారు. ఇదే ముఠా 2008లో హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఓ బ్యాగును అపహరించినట్లు గుర్తించారు. నిందితుల నుంచి సొమ్మును రికవరీ చేశాం. చోరీ చేసిన సొమ్ములో కొంత ఇంటి ఓనర్‌కు ఇచ్చారని, ఆ సొమ్మును కూడా రికవరీ చేస్తామని తెలిపారు. 15 రోజుల్లోనే కేసును చేధించిన జడ్చర్ల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. నేరాల నియంత్రణ, నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు చాలా అవసరమని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని పట్టణాల్లో సీసీ కెమెరాల అమర్చే విషయంలో వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.