కామారెడ్డి జిల్లా(Kamareddy) బాన్సువాడ(Bansuwada) మండలం బోర్లంక్యాంపులో చోరీ(Robberry) జరిగింది. దొంగతనం చేసిన దొంగ తిరిగివెళ్తూ దారిమధ్యలో ఓ చెట్టుకింద పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి ఆ గ్రామస్తులకు దొరికిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా(Kamareddy) బాన్సువాడ(Banswada) మండలం బోర్లంక్యాంపులో చోరీ(Robberry) జరిగింది. దొంగతనం చేసిన దొంగ తిరిగివెళ్తూ దారిమధ్యలో ఓ చెట్టుకింద పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి ఆ గ్రామస్తులకు దొరికిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బోర్లంక్యాంపు(Borlam Village) గ్రామానికి చెందిన కుర్మరాజు(Kurmaraju), ఇతని భార్య ఆదివారంనాడు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి ఓ దొంగ ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి దూరాడు. బీరువాను బద్దలుకొట్టి అందులో ఉన్న ఆరు తులాల బంగారం(Gold) చోరీ చేసి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆ గ్రామ సమీపంలోనే ఉన్న ఓ చెట్టు కింద నిద్రలోకి జారుకున్నాడు. సోమవారం ఉదయం 5 గంటలకే ఇంటికి వచ్చిన రాజు దంపతులు తమ ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంత మంది యువకులు అటుగా వెళ్తుండగా చోరీ చేసిన యువకుడిని గుర్తించారు. అతడిని నిద్రలేపి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అతడిని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు దొరికాయి. యువకుడిని తాడ్వాయి మండలం కనకల్‌ గ్రామానికి చెందిన బత్తుల మోహన్‌గా గుర్తించారు. మోహన్‌ను పోలీసులకు అప్పగించారు.

Updated On 19 Dec 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story