తెలంగాణ(Telangana) ఆడపడుచు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు..
తెలంగాణ(Telangana) ఆడపడుచు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 9 రోజుల పాటు ఊరు, వాడా, పల్లె, పట్టణంలో జరుపుకుంటారు. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడి పాడతారు. ఈ ఏడాది 2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 02న వచ్చింది. ఈ రోజు ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల అంగరంగ వైభవంగా జరిగి అక్టోబరు 10తో ముగుస్తాయి. భాద్రపద అమావాస్య-అక్టోబరు 02 నుంచి దుర్గాష్టమి-అక్టోబరు 10 వరకూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
అక్టోబర్ 02 బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ(Engilipula bathukamma). మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది.
అక్టోబర్ 03 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి - అటుకుల బతుకమ్మ. రెండో రోజు అటుకుల బతుకమ్మ(Atukula bathukamma) నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపు కుంటారు.
అక్టోబర్ 04 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విదియ - ముద్దపప్పు బతుకమ్మ. మూడో రోజు ముద్దపప్పు(Muddhapapu bathukamma) బతుకమ్మ.
అక్టోబర్ 05 శనివారం ఆశ్వయుజ శుక్ల తదియ - నానే బియ్యం బతుకమ్మ. నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.(Nane biyam bathukamma)
అక్టోబర్ 06 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి - అట్ల బతుకమ్మ. ఐదో రోజు అట్ల బతుకమ్మ.(Atla bathukamma)
అక్టోబర్ 07 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి - అలిగిన బతుకమ్మ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ(Aligina bathukama) - ఈ రోజు అమ్మ వారికి నైవేద్యం సమర్పించరు.
అక్టోబరు 08 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్టి - వేపకాయల బతుకమ్మ. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.(Vepakula bathukamma)
అక్టోబరు 09 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి - వెన్నముద్దల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ.(Vena mudhala bathukamma)
అక్టోబరు 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి (దుర్గాష్టమి) - సద్దుల బతుకమ్మ.(Saddula bathukamma)
బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మ లను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటుతాయి. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడి పాడిన తర్వాత.. తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక కొన్ని ప్రాంతాల్లో దుర్గాష్టమి ముందు రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటే.. కొన్ని ప్రాంతాల్లో దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు.