ఆసిఫా బాద్(asifabad) జిల్లాలోని గ్రామీణ బ్యాంకులో(grameen bank) డబ్బులు కొట్టేయడానికి(Bank roberry) ప్రయత్నాలు చేశారు.

ఆసిఫా బాద్(asifabad) జిల్లాలోని గ్రామీణ బ్యాంకులో(grameen bank) డబ్బులు కొట్టేయడానికి(Bank roberry) ప్రయత్నాలు చేశారు. దహెగాం(dahegaon) మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్‌లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. దొంగలకు డబ్బులు, బంగారం లాంటివి ఏవీ దొరకలేదు. నగదు అపహరణకు గురికాలేదని బ్యాంకు అధికారులు కూడా ధృవీకరించారు.

గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు తలుపులు పగులగొట్టి నగదు చోరీకి యత్నించారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని దహెగావ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె రాజు తెలిపారు. బ్యాంక్‌లోని సీసీటీవీలో రికార్డయిన ఫుటేజీ ప్రకారం ఆ వ్యక్తి బ్యాంకు లోపలే తిరుగుతూ ఏమీ దొంగిలించకుండా వెళ్లిపోయాడు. శనివారం బ్యాంకు అధికారులు దొంగ లోపలికి వచ్చినట్లు గుర్తించారు. కాగజ్‌నగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ అల్లం రాంబాబు, దహెగావ్ ఎస్‌ఐ సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. 93983 80952, 87126 70537 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Eha Tv

Eha Tv

Next Story