హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఉద్యోగి శ్రవణ్‌కుమార్ (23)ను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. శ్రవణ్‌కుమార్‌ను పోలీసులే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు అక్కడ చికిత్స పొందిన తర్వాత చనిపోయాడు.
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ (Chadarghat) పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఉద్యోగి శ్రవణ్‌కుమార్ (23) (Sravan Kumar)ను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. శ్రవణ్‌కుమార్‌ను పోలీసులే ఉస్మానియా ఆస్పత్రికి (Osmania Hospital)తరలించారు. రెండు రోజులు అక్కడ చికిత్స పొందిన తర్వాత చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు ఎవరికీ చెప్పలేదు. కనీసం తమ కొడుకు కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో ఈనెల 6న అర్ధరాత్రి యువకుడు శ్రవణ్‌కుమార్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రమాదం గురించి యువకుడి తల్లిదండ్రులకు కానీ, తెలిసినవారికి కానీ పోలీసులు సమాచారం ఇవ్వలేదు. రెండు రోజుల చికిత్స పొందిన తర్వాత ఆస్పత్రిలోనే శ్రవణ్ చనిపోవడంతో మృతదేహాన్ని మార్చురీ కి తరలించారు. ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు ఈనెల 11న అదే పోలీస్‌స్టేషన్‌లో తమ కుమారుడు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా పోలీసులకు యువకుడి ప్రమాదం గురించి తట్టలేదా లేదా కావాలనే దాచారో తెలియదు. చివరికి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులు మార్చురీలో ఉన్న తమ కుమారుడి మృతదేహాన్ని చూసి గుర్తుపట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని పోలీసులను వారు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగి 20 రోజులైనా వాహనాన్ని కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.