మేడారం జాతరకు(Medaram Jathara) తెలంగాణ తరలివెళుతున్నది. ఇప్పుడు మేడారం కుగ్రామం కాదు. మహానగరం! లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార(Tribe Tradition) సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

మేడారం జాతరకు(Medaram Jathara) తెలంగాణ తరలివెళుతున్నది. ఇప్పుడు మేడారం కుగ్రామం కాదు. మహానగరం! లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార(Tribe Tradition) సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంత గొప్ప జాతర ప్రపంచంలో మరెక్కడా జరగకపోవడం విశేషం. ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద జాతరకు వెళ్లేవారు. ఇప్పుడు రవాణా చాలా సులభమయ్యింది. అందుకే భక్తులు కూడా విపరీతంగా పెరుగుతున్నారు. ఇక ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు(Helicopter services) అందుబాటు లోకి వచ్చాయి.ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది.మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను ఏడు నిమిషాల పాటు విహంగ వీక్షణం చేయవచ్చు.హనుమకొండ నుంచి మేడారం జాతరకు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా VIP దర్శనాన్ని పొందవచ్చు.. దీని ధర ఒక్కొక్కరికి 28,999 రూపాయలు. 29 వేల రూపాయలన్నమాట! హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. అలాగే జాతర జరిగే ప్రాంతం మీదుగా ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది.. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొద లయ్యే రైడ్‍ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీని కోసం ఒక్కొక్కరి నుంచి 4,800 రూపాయల ఛార్జీ వసూలు చేయనున్నారు.
హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా [email protected]లో ఆన్‌లైన్‌ లో సంప్రదించవచ్చు..

Updated On 20 Feb 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story