తెలంగాణ ప్ర‌భుత్వం నేడు రెండో విడత రైతు రుణమాఫీ చేయ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు

తెలంగాణ ప్ర‌భుత్వం నేడు రెండో విడత రైతు రుణమాఫీ చేయ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తొలి విడ‌త ల‌క్షలోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ కాగా.. రెండో విడ‌త‌లో లక్షన్నర లోపు రుణాలు మాఫీ అవ‌నున్నాయి. సీఎం అసెంబ్లీ ప్రాంగణంలో లక్షన్నరలోపు రుణాలు ఉన్న ప‌లువురు రైతులకు చెక్కులు పంపిణీ చేయ‌నున్నారు. రెండో విడ‌త రైతు రుణ మాఫీ ద్వారా ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర‌నుంది. రూ.6వేల 500 కోట్ల నగదు బదిలీ కానుంది. ఈ నెల 18న మొదటి విడతలో 11 లక్షల యాభై వేల మందికి రుణమాఫీ చేయ‌గా.. రూ.6 వేల 99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడత రుణమాఫీ ఆగస్టులో జ‌రుగ‌నుంది. మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాల‌ను ప్ర‌భుత్వం మాఫీ చేయనుంది.

Eha Tv

Eha Tv

Next Story