విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని తల్లి మృతి చెందిన విషయాన్ని ఉపాధ్యాయులు దాచి ఉంచారు. ములుగు(Mulugu) జిల్లా కాటారం మండలం దామెరకుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో(Damerakunta Social Welfare College) బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని సౌమ్య(Soumya) తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది.
విద్యార్థిని భవిష్యత్ అంధ కారం కావొద్దని తల్లి మృతి చెందిన విషయాన్ని ఉపాధ్యాయులు దాచి ఉంచారు. ములుగు(Mulugu) జిల్లా కాటారం మండలం దామెరకుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో(Damerakunta Social Welfare College) బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని సౌమ్య(Soumya) తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో తన తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సౌమ్యకు చివరి పరీక్ష కావడంతో ఆమె భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల ఆమోదంతో తల్లి మృతి చెందిన విషయం విద్యార్థినికి తెలియకుండా ఉపాధ్యాయులు దాచారు. పరీక్ష రాసిన సౌమ్య అమ్మ వస్తుందన్న సంతోషంతో కాలేజ్ నుంచి బయటకు వచ్చింది. తన అమ్మ కాకుండా బంధువులు వచ్చి సౌమ్యను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో తల్లి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా సౌమ్య కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సౌమ్యను చూసి స్థానికులు కంట తడిపెట్టారు.