బీఆర్‌ఎస్(BRS )పార్టీ కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు(Vanama Venkateshwar Rao ) సుప్రీంకోర్టులో(supreme court) ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ : బీఆర్‌ఎస్(BRS )పార్టీ కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు(Vanama Venkateshwar Rao ) సుప్రీంకోర్టులో(supreme court) ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. వనమా ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలను సమర్పించినందుకు ఆయన ఎన్నిక చెల్లదని తెలిపింది. అంతేకాదు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరారు.