ప్రజాభవన్ (Praja Bhavan) దగ్గర యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను (Sohail) పోలీసులు అరెస్ట్‌ చేసి పంజాగుట్ట (Panjagutta) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ (Ex. MLA Shakeel) అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్‌ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి

ప్రజాభవన్ (Praja Bhavan) దగ్గర యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను (Sohail) పోలీసులు అరెస్ట్‌ చేసి పంజాగుట్ట (Panjagutta) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ (Ex. MLA Shakeel) అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్‌ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సోహైల్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్‌ను (Abdul Asif)కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్‌ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్‌ నుంచి షకీల్‌ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు (DurgaRao) అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి ఫోన్‌ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

కాగా షకీల్‌ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ (Commisstioner of Police) విచారణకు ఆదేశించారు.షకీల్‌ కొడుకు సోహైల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

షకీల్‌ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసింది షకీల్‌ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో (FIR) మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్‌ ఎవరు? పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Updated On 26 Dec 2023 10:22 PM GMT
Ehatv

Ehatv

Next Story