కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building)ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ప్రారంభించనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. అందుకే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లకూడదని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building)ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ప్రారంభించనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. అందుకే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లకూడదని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఢిల్లీ(Delhi)లోని సంసద్ మార్గ్(Sansad Marg)లో ఉన్న ప్రస్తుత పార్లమెంట్ భవంతి(Old Parliament Building)ని 1912-13లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ డిజైన్ చేశారు. 1921లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. భవన నిర్మాణం ఆరేళ్లపాటు జరిగింది. 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. స్వతంత్ర భారతంలో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలు 1951-52లో జరిగాయి. మొదట ఎన్నికైన పార్లమెంట్ 1952, ఏప్రిల్‌లో ఉనికిలోకి వచ్చింది. మరి అప్పుడు పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించారు? అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పటిలా నేనే చేస్తాను...నాకే ఆ హక్కు ఉంది అని ఆనాటి నాయకులు అనుకోలేదు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)కంటే అధిక ఓట్లు సాధించిన వ్యక్తి రావి నారాయణరెడ్డి(Ravi Narayana Reddy). మన తెలంగాణ వ్యక్తే! తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కూడా! రావి నారాయణరెడ్డి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 17 ఏకసభ్య నియోజకవర్గాలు, నాలుగు ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. నల్గొండ కూడా అప్పుడు ద్విసభ్య నియోజవర్గంగానే ఉండేది. ఇక్కడ రావినారాయణ రెడ్డితో పాటు పోటీ చేసిన, సుకం అచ్చాలు విజయం సాధించారు. ఇద్దరూ పీడీఎఫ్ అభ్యర్థులే. 1952 మార్చి 27 పోలింగ్ జరిగింది. రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సమీప ప్రత్యర్థి వి.భాస్కర్ రావుపై 2,72,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్‌జౌన్‌పూర్(పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూకు వచ్చిన మెజారిటీ 2,33,571 ఓట్లే! దాంతో, నెహ్రూ కంటే అధిక ఓట్లు సాధించిన రావి నారాయణరెడ్డి చేతులమీదుగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. మరో విషయం ఏమిటంటే, అదే సమయంలో రావి నారాయణరెడ్డి భువనగిరి శాసనసభ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు.