రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు(Patnam Mahender Reddy) ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తల మధ్య మహేందర్‌రెడ్డి తన పుట్టిన రోజును(Birthday) ఆనందంగా జరుపుకున్నారు.

Patnam Mahender Reddy
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు(Patnam Mahender Reddy) ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తల మధ్య మహేందర్‌రెడ్డి తన పుట్టిన రోజును(Birthday) ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె.అశోక్‌రెడ్డి(Ashok ), డైరెక్టర్ బి. రాజమౌళి మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేయించారు. శాలువతో సత్కరించి బోకే అందించారు. సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డెరైక్టర్ నాగయ్య కాంబ్లే , సీఐఈ రాధా కిషన్ , జాయింట్ డైరెక్టర్‌లు, డీఈఈలు, ఇతర అధికారులు, సిబ్బంది మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు కూడా హాజరయ్యారు.
