ఆర్టీఏ నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ప్రక్రియలో ఓ నెంబర్‌కు ఏకంగా 10 లక్షల రూపాయలు పలికింది. హైదరాబాద్ ఖైరతాబాద్(Khairathabad) ఆర్టీఏ కార్యాలయంలో(RTA Office) ఈ వేలం ప్రక్రియ జరిగింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం(Fancy number Auction) ద్వారా మొత్తం 18,02,970 ఆదాయం వచ్చిందని జాయింట్ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు.
ఆర్టీఏ నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ప్రక్రియలో ఓ నెంబర్‌కు ఏకంగా 10 లక్షల రూపాయలు పలికింది. హైదరాబాద్ ఖైరతాబాద్(Khairathabad) ఆర్టీఏ కార్యాలయంలో(RTA Office) ఈ వేలం ప్రక్రియ జరిగింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం(Fancy number Auction) ద్వారా మొత్తం 18,02,970 ఆదాయం వచ్చిందని జాయింట్ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు. ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్లు వేలం వెయ్యడం జరిగిందని.. దీనికి చాలామంది హాజరై ఉత్సాహంతో పోటీపడ్డారని ఆయన తెలిపారు.
వేలంలో TS11 EZ 9999 ఫ్యాన్సీ నెంబర్‌కు ఏకంగా 9,99,999 రూపాయలు పలికింది. ఈ నెంబర్‌ను చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొనుగోలు చేసిందని కమిషనర్ తెలిపారు. అలాగే TS 11 FA 0001 నెంబర్ కు మూడు లక్షలు పలకగా.. కామినేని సాయి శివనాగ్ ఆ నంబర్‌ను దక్కించుకున్నారు. అదేవిధంగా TS 11 FA 0011 నెంబర్‌కు రూ.1,55,400 పలకగా.. సామ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెంబర్‌ను దక్కించుకున్నారని కమిషనర్ పాండురంగ నాయక్ వెల్లడించారు.