వర్షాలు వేసవితాపం నుంచి కొందరికి ఊరట కలిగిస్తే రైతులకు మాత్రం దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు రైతుల కంట్లో నీరు నింపుతున్నాయి. కాగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు వేసవితాపం నుంచి కొందరికి ఊరట కలిగిస్తే రైతులకు మాత్రం దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు రైతుల కంట్లో నీరు నింపుతున్నాయి. కాగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వర్షాలు పడొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా వర్షం ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురువారం కొమ్రంభీమ్ అసిఫాబాMeteorological Center Of Hyderabad ద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.