టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్(Group-1 Prelims) పరీక్ష రద్దైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. జూన్ 11న టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

Big Breaking
టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్(Group-1 Prelims) పరీక్ష రద్దైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. జూన్ 11న టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని.. పరీక్షకు ముందు జరిగిన పరిణామాలపై అనుమానం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది. గతంలో కూడా పేపర్ లీకేజీ కారణాలతో గ్రూప్-1 పరీక్ష రద్దైంది.
