అమరవీరుల (Martyrs) ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం. గత 10 ఏళ్లలో కేసీఆర్‌ (KCR)సర్కార్‌ అమరవీరుల ఆశయాలను నెరవేర్చలేదని.. అమరవీరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేశారని ప్రతీ సందర్భంలో కాంగ్రెస్‌ (Congress), సీఎం రేవంత్‌ (CM Revanth) విమర్శలు చేస్తూ వచ్చారు.

అమరవీరుల (Martyrs) ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం. గత 10 ఏళ్లలో కేసీఆర్‌ (KCR)సర్కార్‌ అమరవీరుల ఆశయాలను నెరవేర్చలేదని.. అమరవీరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేశారని ప్రతీ సందర్భంలో కాంగ్రెస్‌ (Congress), సీఎం రేవంత్‌ (CM Revanth) విమర్శలు చేస్తూ వచ్చారు. ఈనెల 7న రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. గత ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం (Job) కల్పించింది. లూంబినీ పార్క్‌ దగ్గర దీపం ఆకారంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. అయితే అమరవీరుల కుటుంబాల్లో లెక్కలు సరిగా దొరకలేదని.. కొంత మంది నిజమైన అర్హులకు ఇవి అందకపోవచ్చు. దీనిని ఎత్తిచూపుతూ కేసీఆర్‌ సర్కార్‌ అమరులకు అన్యాయం చేసిందని చెప్తూ వచ్చింది.

సాధారణంగా తెలంగాణ (Telangana)లో కొత్త సర్కార్‌ కొలువైనప్పుడు.. గన్‌పార్క్‌లో ఉన్న అమరవీరుల స్థూపాన్ని అందంగా తయారుచేసేవారు. గత రెండు పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్‌.. కొత్త సర్కార్‌ కొలువైన సందర్భంలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్‌ 2న, ఆగస్ట్ 15, జనవరి 16న గన్‌పార్క్‌లో (GunPark) ఉన్న అమరవీరుల స్థూపానికి వచ్చి నివాళులు అర్పించేవారు. ముఖ్యంతగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా.. ప్రభుత్వ పరంగా కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాతే అసెంబ్లీకి వెళ్లేవారు. ఆ తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌లోని స్థూపం వద్ద నివాళులు అర్పించేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువైంది. అమరవీరుల స్థూపం వద్ద మాత్రం హడావిడి లేదు. స్థూపానికి అలంకరణ లేకపోగా.. సీఎం రేవంత్‌ అక్కడ నివాళులు అర్పించకపోవడంతో తెలంగాణవాదులు కొంత ఆవేదన చెందుతున్నారట. అమరవీరుల స్థూపానికి ఈరోజు మొదటగా బీజేపీ (BJP), తర్వాత బీఆర్‌ఎస్‌ (BRS), చివరగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వచ్చి నివాళులు అర్పించినా.. ప్రభుత్వ పరంగా సీఎం రాకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్‌కు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం గుర్తుంది. కానీ అమరులకు నివాళులు అర్పించలేకపోయారా అని వాపోతున్నారు. ప్రమాణస్వీకారం రోజున కూడా సీఎం సహా ఒక్క మంత్రి కూడా జై తెలంగాణ అనకపోవడంతో తెలంగాణవాదులు దీని చర్చించుకుంటున్నారట. అమరవీరులపై రేవంత్ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని అనుకుంటున్నారట.. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated On 9 Dec 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story