పొద్దున్నే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(Falaknuma Express)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అదృష్టవశాత్తూ ప్రయాణికులకేం కాలేదు.. అగ్నిప్రమాదం ఘటన జరిగిన వెంటనే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఆ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? హైదరాబాద్లో(Hyderabad) ఫలక్‌నుమా ప్యాలెస్(Falaknuma Palace) పేరుతోనే ఆ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆ పేరు పెట్టారు. ఫలక్‌నుమా ఓ పర్షియా పదం. అర్థమేమిటంటే ఆకాశ ప్రతిబింబం.. సరిగ్గా చెప్పాలంటే స్వర్గ ప్రతిబింబమన్నమాట!
పొద్దున్నే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(Falaknuma Express)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అదృష్టవశాత్తూ ప్రయాణికులకేం కాలేదు.. అగ్నిప్రమాదం ఘటన జరిగిన వెంటనే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఆ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? హైదరాబాద్లో(Hyderabad) ఫలక్‌నుమా ప్యాలెస్(Falaknuma Palace) పేరుతోనే ఆ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆ పేరు పెట్టారు. ఫలక్‌నుమా ఓ పర్షియా పదం. అర్థమేమిటంటే ఆకాశ ప్రతిబింబం.. సరిగ్గా చెప్పాలంటే స్వర్గ ప్రతిబింబమన్నమాట! దక్షిణమధ్య రైల్వే ఆధీనంలో నడిచే ఈ సూఫర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 1993 అక్టోబర్ 15వ తేదీన మొదలయ్యింది. హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మర్నాడు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలకు హౌరా చేరుకుంటుంది. ప్రతి రోజూ నడిచే ఈ రైలు సుమారు 1,544 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇంచుమించు 959 మైళ్లు. సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చాలా తక్కువ స్టేషన్‌లలోనే ఈ ట్రైన్ ఆగుతుంది. నిత్యం రద్దీగానే ఉంటుంది. సికింద్రాబాద్, హౌరా మధ్య 24 స్టేషన్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే మళ్లీ ఆగేది నల్లగొండలోనే. తర్వాత గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ జంక్షన్‌లలో ఆగి చివరగా హౌరా చేరుకుంటుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్‌రిజర్వడ్ కోచ్‌లు ఉన్నాయి. క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంతకు ముందు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (ఇది సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతుంది) కోచ్‌లను మార్చుకునేది. ఇప్పుడు అజంతా ఎక్స్‌ప్రెస్ (ఇది సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళుతుంది) కోచ్‌ను మార్చుకుంటోంది. శతాబ్ది, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్ రైళ్లలాగే ఇది కూడా చాలా శుభ్రంగా ఉంటుంది.