గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ చలాన్లను (Challans) వసూళ్లు చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) డిస్కౌంట్లు ప్రకటించి వెసులుబాటు కల్పిస్తున్నారు. తాజాగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లపై డిస్కోట్ ప్రకటించి పెండింగ్ చలాన్లు చెల్లించాలని ప్రకటించారు

traffic police-compressed
గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ చలాన్లను (Challans) వసూళ్లు చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) డిస్కౌంట్లు ప్రకటించి వెసులుబాటు కల్పిస్తున్నారు. తాజాగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లపై డిస్కోట్ ప్రకటించి పెండింగ్ చలాన్లు చెల్లించాలని ప్రకటించారు. డిస్కౌంట్‌పై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ-చలాన్ వెబ్‌సైట్‌కు (E-Challan) ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇంటర్నెట్‌లో ఈ-చలాన్ సైట్‌కు వెళ్లి క్లిక్ చేస్తే.. 'Oops! Something went wrong'... అని దర్శనమిస్తోంది. నిన్నటి నుంచి సైట్‌లో వాహనం నెంబర్ (Vehicle Number) ఎంటర్ చేస్తే దానిపై ఉన్న పెండింగ్ చలాన్లను చూపడం లేదు. నేడు ఏకంగా అసలు సైటే పనిచేయడం లేదంటూ వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
