ఈ నెల 29, 30 తేదీలలో మేడారంలో(Medaram) సమ్మక్క(samakka), సారలమ్మ(Saralamma) అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు పూజారులు చెప్పారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజాలు, వాటాదారులు సమావేశం అయ్యారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా దేవాదాయశాఖ అధికారులపై ఒత్తడి తెస్తున్నారని పూజారులు ఆరోపిస్తున్నారు.

ఈ నెల 29, 30 తేదీలలో మేడారంలో(Medaram) సమ్మక్క(samakka), సారలమ్మ(Saralamma) అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు పూజారులు చెప్పారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజాలు, వాటాదారులు సమావేశం అయ్యారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా దేవాదాయశాఖ అధికారులపై ఒత్తడి తెస్తున్నారని పూజారులు ఆరోపిస్తున్నారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్‌ మేడారం జాతర కార్యాలయం కోసం వరంగల్‌లో స్థలాన్ని కేటాయించారన్నారు. భద్రాకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుంచి రెండు కోట్ల రూపాయలు సేకరించి ఆఫీసు నిర్మించారని గుర్తుచేశారు.ఇందులోనే అన్ని దేవాదాయ శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నప్పటికీ ఒక్క మేడారం కార్యాలయాన్ని ఖాళీ చేయించి, వేద పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని పూజారులు విమర్శించారు. అమ్మవార్లకు కేటాయించిన స్థలంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజులు దర్శనం నిలిపివేస్తామని తెలిపారు. అధికారులు స్పందించకుంటే జూన్‌ మొదటి వారంలో వరంగల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Updated On 20 May 2024 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story