అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమతి ఆధ్వర్యంలో ఈ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సుమారు ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమతి ఆధ్వర్యంలో ఈ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సుమారు ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఈ ఏడాది 69వ సంవత్సరం 61 అడుగుల ఎత్తులో వినాయక విగ్రహాన్ని(Vinayaka Idol) ప్రతిష్టిస్తున్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్(Dhanam Nagendra), కార్పొరేటర్ పి.విజయారెడ్డి(P.Vijaya Reddy), హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ కె.ప్రసన్నలు(K.Prasanna) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ గణపతి ప్రపంచంలోనే ప్రసిద్ది పొందిందని, ఏటా లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారని దానం నాగేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నదని, ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు కూడా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.