ఎన్నికలు(Elections) సమీపిస్తున్న సమయంలో అసంతృప్తుల బెడద నుంచి ఏ పార్టీ తప్పించుకోలేదు. అయితే బీఆర్‌ఎస్(BRS) మాత్రం అసంతృప్తులను బుజ్జగించడంలో విజయవంతం అవుతున్నది. చాలా ముందుగానే బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అభ్యర్థులను(Candidate) ప్రకటించడంతో అక్కడక్కడ నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ అధినాయకత్వంపై సీరియస్ అయ్యారు.
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న సమయంలో అసంతృప్తుల బెడద నుంచి ఏ పార్టీ తప్పించుకోలేదు. అయితే బీఆర్‌ఎస్(BRS) మాత్రం అసంతృప్తులను బుజ్జగించడంలో విజయవంతం అవుతున్నది. చాలా ముందుగానే బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అభ్యర్థులను(Candidate) ప్రకటించడంతో అక్కడక్కడ నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ అధినాయకత్వంపై సీరియస్ అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్(Satation Ghanpur) నియోజకవర్గంలో కూడా ఇదే జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను(Rajaiah) కాదని కడియం శ్రీహరి(Kadiyam Srihari) అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కేసీఆర్. దీంతో రాజయ్య హైకమాండ్‌పై పోరుకు సిద్ధమయ్యారు. కడియం శ్రీహరి టార్గెట్‌గా అనేక సెటైర్లు వేశారు. కామెంట్లు చేశారు. శ్రీహరిని ఓడిస్తా అంటూ సవాల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ప్రగతిభవన్‌లో కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్యలతో మంత్రి కేటీఆర్(KTR) సమావేశమయ్యారు. ఈ భేటిలో రాజయ్యను శాంతింపచేశారు కేటీఆర్. దీంతో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపుకోసం, పార్టీ కోసం పని చేస్తానని రాజయ్య హామీ ఇచ్చారు. శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడియం శ్రీహరితో చేతులు కలిపారు. ఇదే సమయంలో రాజయ్యకు కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. పార్టీలో రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.రాజయ్య భవిష్యత్తుకు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు.