తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను(electric buses)ఆర్డర్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను(electric buses)ఆర్డర్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఛార్జింగ్‌ స్టేషన్‌లను(charging stations)ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Cm Revanth Reddy)ప్రారంభిస్తారు. ఈ బస్సుల కారణంగా కాలుష్యం బాగా తగ్గిపోనుంది. దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులు తెలంగాణకు వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో పనిచేస్తాయి. వెయ్యి బస్సులలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్‌లలోనే తిరుగుతాయి. ఎంజీబీఎస్(MGBS),జేబీఎస్(JBS),హెచ్‌సీయూ(HCU),హయత్‌నగర్-2(Hayatnagar),రాణిగంజ్(Raniganj), కూకట్‌పల్లి(kukatpally),బీహెచ్‌ఈఎల్(BHEL),హైదరాబాద్-2(Hyderabad),వరంగల్(Warangal),సూర్యాపేట(Suryapeta),కరీంనగర్-2(Karimnagar),నిజామాబాద్(Nizamabad)సహా పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story