తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వివాహాలు, కుటుంబ కార్యక్రమాలు, పార్టీలు, ఇతర సందర్భాలలో బస్సు అద్దెలపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్ర‌క‌టించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వివాహాలు, కుటుంబ కార్యక్రమాలు, పార్టీలు, ఇతర సందర్భాలలో బస్సు అద్దెలపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్ర‌క‌టించింది. డిసెంబర్ 31 వరకు చేసిన బుకింగ్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

పండుగ, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నందున.. ఈ బిజీ సమయంలో రవాణా అవసరాల డిమాండ్‌ను పరిష్కరించడానికి.. వేడుకల సందర్భాలలో సరసమైన ధ‌ర‌ల‌తో నమ్మక‌మైన ప్ర‌యాణ స‌దుపాయాన్ని అందించే టీఎస్ఆర్టీసీని ప్ర‌జ‌లు ఎంపిక చేసుకునేందుకు ఆర్టీసీ ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. డిసెంబర్ 31, 2024 వరకు బుకింగ్‌లకు తగ్గింపు అందుబాటులో ఉంది.

ప్రైవేట్ వాహనాల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న నేప‌థ్యంలో పెళ్లీల్లు, ఇత‌ర‌ ఈవెంట్‌లకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెప్పింది. బుకింగ్‌ల‌ను సులభతరం చేయడానికి ఆర్టీసీ ముందస్తు నగదు డిపాజిట్లను కూడా మాఫీ చేసింది. దీంతో కస్టమర్లు వేడుకల కోసం వాహ‌నాలు బుక్ చేసుకోవడం సులభం అయ్యింది.

మరింత సమాచారం కోసం లేదా రిజర్వేషన్ చేయడానికి.. ఆసక్తిగల వ్యక్తులు వారి స్థానిక TSRTC డిపో మేనేజర్‌ని సంప్రదించవచ్చు లేదా www.tgsrtconline.inలో అధికారిక TSRTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story