కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇకపై తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీ కు మార్చనున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఆల్ఫాబెట్ (సంక్షిప్తీకరణ)ను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు 'టీఎస్' అనే అక్షరాలు కాకుండా.. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ (TG) అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ […]

కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇకపై తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీ కు మార్చనున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఆల్ఫాబెట్ (సంక్షిప్తీకరణ)ను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు 'టీఎస్' అనే అక్షరాలు కాకుండా.. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ (TG) అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'ను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు. గ్రూప్-1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర చిహ్నం రాచరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని.. రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించింది.

Updated On 4 Feb 2024 9:37 PM GMT
Yagnik

Yagnik

Next Story